
ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.చదువుకున్న వారినుంచి చదువు అంతగా లేని వారు కూడా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుత కాలంలో మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. కమ్యూనికేషన్ నుంచి వినోదం వరకు, విద్య నుంచి వ్యాపారం వరకు అన్ని రంగాలలో వీటి వినియోగం బాగా పెరిగింది. అయితే చాలా మంది తమ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్లకోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికోసం పదివేల రూపాయలలోపు స్మార్ట్ఫోన్లు గురించి సమాచారం ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు
Poco M7: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 8వేల750.ఇది 6.88 అంగుళాల డిస్‌ప్లే, 50MP వెనుక కెమెరా, 5160 mAh బ్యాటరీతో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.
Redmi Note 11T 5G: ఈ డివైజ్ ధర రూ. 9వేల490. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 50MP+8MP వెనుక కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో అద్బుతమైన పనితీరును కనబరుస్తుంది.
Samsung Galaxy F06 5G: ఈ స్మార్ట్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP+2MP బ్యాక్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ ప్రస్తుతం రూ. 8వేల499 ధరతో లభిస్తుంది.
Oppo A3X 5G: ఈ స్మార్ట్ ఫోన్ రూ. 8వేల999లకు అందుబాటులో ఉంది.
Vivo Y15c: ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రూ. 6వేల990 ధరతో అందుబాటులో ఉంది.
Moto G35 5G: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9వేల999
కొంచెం ఎక్కువ బడ్జెట్‌లో (సుమారు రూ.15వేలనుంచి రూ.20లోపు) స్మార్ట్ ఫోన్లు
Oppo K13: ఈ స్మార్ట్ ఫోన్ రూ. 17వేల999/- ధరలో లభిస్తుంది. 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులో ఉంది.
iQOO Z10: ఈ హ్యాండ్ సెట్ రూ. 21వేల999ల ధరలో అందుబాటులో ఉంది. ఇందులో 7300mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ఉంటుంది.
మీరు బడ్జెట్, ఫీచర్లు(కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్) ,బ్రాండ్ ప్రాధాన్యతల ఆధారంగా మీకు సరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవచ్చు.