ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా వ్యాప్తి రోజు రోజుకు ఉదృతం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్  కేసులు ఏడు లక్షలు దాటాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 723,106కు చేరింది.  అత్యధికంగా 1,42,224 కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇటలీ 97,689 , చైనా 81470, స్పెయిన్ 80,110, జర్ననీ 62435 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 33,984 కి చేరింది. అత్యధికంగా ఇటలీలో చనిపోయారు. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10779కి చేరింది. ఆ తర్వాత 6803 మరణాలతో స్పెయిన్ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత 3304 మరణాలతో చైనా, 2640 మరణాలతో ఇరాన్, 2606 మరణాలతో ఫ్రాన్స్, 2485 మరణాలతో అమెరికా ఉన్నాయి.