దారుణం : హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఏడుగురు మృతి

దారుణం : హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఏడుగురు మృతి

గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ఈ నలుగురు మురుగు ట్యాంక్ లో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన.. ఇండియాలో శానిటేషన్ క్లీనింగ్ వ్యవస్థ ఎంత ప్రాణాంతక పరిస్థితుల్లో కొనసాగుతోందో చెప్పకనే చెబుతోంది.

వడోదర నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దభోయ్ పట్టణం… దర్శన్ హోటల్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లోకి దిగినవారు నలుగురు శానిటేషన్ సిబ్బంది సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని వార్తా సంస్థలు చెప్పాయి.  మృతులను మహేశ్ పతన్ వాడియా, అశోక్ హరిజన్, బ్రిజేష్ హరిజన్, మహేశ్ హరిజన్ లుగా గుర్తించారు. మృతుల్లోని మరో ముగ్గురు హోటల్ లో పనిచేసే సిబ్బంది. అజయ్ వాసవ, విజయ్ చౌహాన్, సహదేవ్ వాసవగా వీరిని గుర్తించారు.

లోపలికి దిగిన మొదటి వ్యక్తి స్పందించకపోవడంతో మరో ముగ్గురు సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్లారని డీఎస్పీ కల్పేష్ సోలంకి చెప్పారు. ఆ ముగ్గురు స్పందించకపోవడంతో.. మరో మగ్గురు హాస్పిటల్ సిబ్బంది లోపలికి దిగారని.. వారిని పైనున్న వారు వెంటనే బయటకు లాగారని చెప్పారు. ముందుగా స్పృహ కోల్పోయిన ఆ ముగ్గురు తర్వాత ప్రాణాలు కోల్పోయారని అన్నారు. హోటల్ మేనేజ్ మెంట్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ.. యజమానిపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు.