
త్రిపుర అగర్తలాలో దారుణం జరిగింది. 8 ఏళ్ల చిన్నారిపై ఏడుగురు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. అగర్తల విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో టెబారియా గ్రామానికి చెందిన ఏడుగురు మైనర్లు అదే ఊరికి చెందిన చిన్నారిని ఆటలాడుకునేందుకు పిలిచి ఈ దారుణానికి ఒడిగట్టారు.
అయితే తమ కుమార్తె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి ఆపస్మారక స్థితిలో తీవ్రగాయాలపాలైనట్లు గుర్తించిన పోలీసులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు అదే గ్రామానికి చెందిన మైనర్లను విచారించగా..ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నేరం అంగీకరించిన తరువాత తమకు ఏమీ అర్ధం కాలేదని చెప్పడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. కరోనా టెస్ట్ లు చేసి అనంతరం జువైనల్ హోంకి తరలించారు.