అమీర్పేటలో మనీలాండరింగ్ పేరుతో రూ.53 లక్షల మోసం

అమీర్పేటలో  మనీలాండరింగ్ పేరుతో రూ.53 లక్షల మోసం
  • వృద్ధుడిని నుంచి కొట్టేసిన చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు: మనీలాండరింగ్ పేరుతో అమీర్​పేటకు చెందిన 77 ఏండ్ల వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. తొలుత పోలీసు యూనిఫామ్​లో బాధితుడికి వీడియో కాల్ చేసి, తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని బెదిరించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఫిక్స్డ్​​డిపాజిట్లు, బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు తమకు బదిలీ చేయాలన్నారు. 

వాటిని వెరిఫికేషన్ చేసిన తర్వాత తిరిగి చెల్లిస్తామని నమ్మించారు. దీంతో బాధితుడు రూ.53 లక్షలు స్కామర్ల ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం స్కామర్లు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి, సైబర్ క్రైమ్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు.