హీరా గోల్డ్ కేసులో 81 ప్లాట్లు సీజ్

హీరా గోల్డ్ కేసులో 81 ప్లాట్లు సీజ్

వీటి విలువ రూ.71 కోట్లు
ఇప్పటికే రూ.300 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

హైదరాబాద్‌‌,వెలుగు: హీరా గోల్డ్‌‌కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. కేసుతో లింక్ ఉన్న ఆస్తులను సీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ షేక్ పేట్ ఎస్ఏ కాలనీలోని రూ.71 కోట్ల విలువైన 81 ప్లాట్లను జప్తు చేసింది. స్థానిక రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఆస్తులను స్వాధీనం చేసుకుంది. నౌహీరా షేక్ పై దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల ఆధారంగా రూ.5,600 కోట్లకు పైగా ఆస్తుల వివరాలను ఈడీ సేకరించింది. మనీలాండరింగ్‌ ‌కేసులు నమోదు చేసిన ఈడీ.. ఇప్పటికే సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. గత మార్చిలో హైదరాబాద్‌‌తోపాటు శివారు ప్రాంతాల్లోని హీరా అనుబంధ సంస్థలుగా ఉన్న బిల్డర్స్ కార్యాలయాల్లో సోదాలు జరిపింది. నౌహీరా షేక్ నుంచి రూ.50 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్న బిల్డర్స్ ఇండ్లతో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.

For More News..

సగం సంక్షేమ హాస్టళ్లు.. కిరాయి బిల్డింగుల్లోనే

కరోనా కష్టాలతో గోల్డ్ అమ్ముకుంటున్నరు

ఈ నెల 15 నుంచి ఈ-కలెక్టరేట్