కరోనా కాక్ టెయిల్ డ్రగ్ తీసుకున్న తొలి వ్యక్తి

కరోనా కాక్ టెయిల్ డ్రగ్ తీసుకున్న తొలి వ్యక్తి

కరోనా ట్రీట్ మెంట్ లో యాంటీబాడీ కాక్ టెయిల్ దేశంలో ఫస్ట్ టైం ఉపయోగించారు. హర్యాణకు చెందిన 82 ఏళ్ల కరోనా బాధితుడికి రెండు రోజుల క్రితం మోనోక్లోనల్ యాంటి బాడీస్ కాక్ టెయిల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు మేధాంత హాస్పిటల్ ఛైర్మన్ నరేష్ త్రెహన్. డిశ్చార్జ్ అయినప్పటికీ ఆయన ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ వైరస్ సహా ఇతర రోగ కారకాలతో పోరాడతాయన్నారు. గతేడాది ఇలాంటి చికిత్సనే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ఇచ్చారని గుర్తు చేశారు. అమెరికా, ఐరోపా దేశాల్లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. 

కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే రెండు రకాల యాంటీ బాడీలను కలిపి ఫస్ట్ స్టేజ్ లోనే పేషంట్లకు ఇస్తే కరోనా వైరస్ ను అడ్డుకుంటాయన్నారు తెహ్రాన్. ఇండియాలో గుర్తించిన వేరియంట్ పైనా ఇది సమర్థంగా పని చేస్తోందన్నారు. ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ కారణంగా హాస్పిటల్ వెళ్లే పేషంట్ల సంఖ్య 70 శాతం తగ్గిందన్నారు. ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను రోచ్ ఇండియా, సిప్లా కలిసి భారత మార్కెట్ లో విడుదల చేశాయి. దీని ఒక్క డోసు ధర 59 వేల 750గా ఉంది.