హిమాచల్ లో వర్ష బీభత్సం.. సిమ్లాలో కూలిన శివాలయం

హిమాచల్ లో వర్ష బీభత్సం.. సిమ్లాలో కూలిన శివాలయం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సోమవారం సిమ్లాలోని కొండచరియలు విరిగిపడటంతో ఓ ఆలయం కుప్పకూలిపోయింది. సమ్మర్ హిల్ ప్రాంతంలో  శివాలయంపై కొండచరియలు విరిగిపడి  9 మంది సజీవ సమాధి అయ్యారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ ఎఫ్ రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు.  
ఘటనపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సిఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.  సిమ్లాలో శివమందిర్ కూలిపోవడం బాధాకరం.. ఇప్పటికే 9 మంది మృతదేహాలను వెలికితీశారు. శిథిలాలను తొలగించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోంది. ఇప్పటికీ కొంతమంది శిథిలాలకింద చిక్కుకుపోయి ఉన్నారని ముఖ్యమంత్రి ఓ ట్వీట్ లో తెలిపారు. 

సావన్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు భక్తులు తరలివచ్చారు. ప్రమాద సమయంలో దాదాపు 50 మంది  శివాలయంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 9మంది మృతదేహాలను వెలికి తీశారు. చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు  సహాయక చర్యలు చేపట్టారు. 

సావన్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు భక్తులు తరలివచ్చారు. ఒక అధికారి ప్రకారం, సంఘటన జరిగినప్పుడు దాదాపు 50 మంది గుమిగూడారు.ఇప్పటికీ చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు శ్రద్ధగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికీ చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు శ్రద్ధగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.