ఎయిర్ హోస్టెస్ కు..ప్రయాణికుడికి లొల్లి పెట్టిచ్చిన శాండ్ విచ్

ఎయిర్ హోస్టెస్ కు..ప్రయాణికుడికి లొల్లి పెట్టిచ్చిన శాండ్ విచ్

విమాన ప్రయాణంలో విమాన సిబ్బందికి, ప్రయాణికులకు గొడవ జరగడం కామన్.  ఫుడ్ , ఇతర సౌకర్యాల విషయంలో సిబ్బంది, ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అయితే తాజాగా ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్, ప్యాసెంజర్ మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 అసలేం జరిగిందంటే..

 6E12 నెంబర్ గల ఇండిగోకు విమానం ఇస్తాంబుల్‌ నుంచి ఢిల్లీ వైపు వస్తుంది. ఈ  సమయంలో ఓ ప్యాసింజర్కు , ఎయిర్ హోస్టెస్కు ఫుడ్ విషయంలో స్వల్ప గొడవ జరిగింది. ఎయిర్ హోస్టెస్పై ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించడంతో ఆమె ఏడ్చింది.  దీంతో మరో ఎయిర్ హోస్టెస్ వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్యాసింజర్..మరో ఎయిర్ హోస్టెస్పై కూడా చిర్రుబుర్రులాడాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె అతడికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. 

పని మనిషిని కాదు..

ప్యాసింజర్కు సేవకురాలివి అంటూ దురుసగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై ఎయిర్ హోస్టెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఉద్యోగిని అని.... తనకు పనిమనిషిని కాదని గట్టిగా అరిచింది. దీంతో ఎందుకు అరుస్తున్నావు  నోర్మూసుకో అంటూ  ప్రయాణికుడు హెచ్చరించాడు. నువ్వే నోర్మూసుకో అంటూ ఎయిర్‌హోస్టెస్‌ బదులిచ్చింది. ఇతర సిబ్బంది ఇద్దరిని వారించడంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. 

ఆమె తప్పేమి లేదు..

ఈ ఘర్షణపై జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో సంజీవ్‌ కపూర్‌ స్పందించారు. ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌కు ఆయన మద్దతు పలికారు. సిబ్బంది కూడా మనుషులేనని చెప్పారు. కొన్నేళ్లుగా విమానంలో సిబ్బందిపై దురుసగా ప్రవర్తించడం చూశానని తెలిపారు. ఈ గొడవలో ఎయిర్ హోస్టెస్ ఒత్తిడికి గురైందని..అందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్నారు. 

శాండ్ విచ్ కోసం..

ఇండిగో ఫ్లైట్‌ వివాదంపై స్పందించిన ఇండిగో యాజమాన్యం...ప్యాసింజర్ శాండ్‌విచ్ అడిగితే అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేస్తామని సిబ్బంది చెప్పారని పేర్కొంది. ఆ లోపే ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌పై గట్టిగా అరిచాడని చెప్పింది.  దీంతో భయాందోళనకు గురైన ఎయిర్ హోస్టెస్ ఏడ్చినట్లు  వివరించింది.