నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న “థ్రాష్” ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్కి వచ్చిన ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.‘బ్రిడ్జర్టన్’ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఫోబ్ డైనోవర్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. విట్నీ పీక్, హౌన్సు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
డైరెక్టర్ టామీ విర్కోలా తెరకెక్కించిన ఈ సినిమా ఒక తీరప్రాంత పట్టణం నేపథ్యంగా సాగుతుంది. ఈ మూవీకి సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ప్రేక్షకులను కట్టిపడిసేలా సస్పెన్స్ సీన్స్ ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఫోబ్ డైనోవర్ నటన అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు.
సాధారణ గర్భిణి ఎదుర్కొనే శారీరక ఇబ్బందులను, ప్రాణాపాయ స్థితిలో ఉండే మానసిక ఆందోళనను సైతం అద్భుతంగా పండించారని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కారులో చిక్కికున్నప్పుడు వచ్చే సీన్స్ కళ్ళను చమర్చేలా చేసిందని ట్వీట్స్ పెడుతున్నారు.
గతంలో ఇదే పాయింట్తో థొవినో థామస్ నటించిన ‘2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో’ అనే మలయాళ చిత్రం వచ్చింది. 2018 కేరళ వరదల నేపథ్యంలో మూవీ రూపొందించబడింది. ఇది విమర్శకుల ప్రశంసలు పొంది, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సరిగ్గా అలంటి కథతోనే వచ్చిన ఈ మూవీ, ఉత్కంఠభరిత కథను ఆస్వాదించాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్గా నిలిచింది.
just finished, phoebe is such an incredible actress and never fails to impress me <3 such an anxiety inducing story i thoroughly enjoyed. everybody go watch for phoebe!! https://t.co/9dbOJDRVAR
— luis (@dynevorfilm) April 10, 2026
“థ్రాష్” కథేంటంటే:
ఒక భారీ గ్రేడ్-5 హరికేన్ (తుఫాను) తీరప్రాంత పట్టణాన్ని అతలాకుతలం చేస్తుంది. హెన్న్రీ దాడితో ఆ ప్రాంతం పూర్తిగా నీటమునిగిపోతుంది. వరదలు, తీవ్ర గాలులతో పాటు ఆకలితో ఉన్న సొరచేపలు Sharks) పట్టణంలోకి ప్రవేశిస్తాయి. దీంతో పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో కొందరు ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోతారు. మరికొందరు బయట ప్రాణాపాయ పరిస్థితుల్లో పడిపోతారు.
►ALSO READ | Ram Charan: పిల్లల పెంపకంలో చరణ్ స్టైల్ ఇదే.. “రఫ్ డాడ్”గా ఓపెన్ అయిన స్టార్
ఇదే సమయంలో నిండు గర్భిణి అయిన లిసా (ఫోబ్ డైనోవర్) ఆ వరదలో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో లిసా కారులోనే చిక్కుకుపోతుంది. తన బిడ్డకు జన్మనివ్వడం కోసమైనా ఆమె బతకాలని అనుకుంటుంది.
ఒకవైపు పురిటి నొప్పులు, మరోవైపు చుట్టూ తిరిగే షార్క్స్.. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో ఆమె తనను తాను ఎలా రక్షించుకుంది? కడుపులో ఉన్న తన బిడ్డను ఎలా కాపాడుకుంటుంది? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
విశ్లేషణ:
“థ్రాష్” సినిమా డిజాస్టర్ ఎలిమెంట్స్‌తో పాటు సర్వైవల్ డ్రామాను మిళితం చేస్తూ సాగుతుంది. కథలో ఉత్కంఠ, ఎమోషన్ రెండూ సమంగా కనిపిస్తాయి. విపత్తు మధ్య మనుషుల పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేసింది. సస్పెన్స్, డిజాస్టర్, సర్వైవల్ కథలు ఇష్టపడే వారికి “థ్రాష్” మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. కొన్ని చోట్ల కథ సాదాసీదాగా అనిపించినా, టెన్షన్ క్రియేట్ చేసే సన్నివేశాలు సినిమా బలంగా నిలుస్తాయి.

