కండక్టర్​ లేకుండా పది కిలోమీటర్ల ప్రయాణం

కండక్టర్​ లేకుండా పది కిలోమీటర్ల ప్రయాణం

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ లేకుండా 10 కిలోమీటర్లు ప్రయాణించింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన ప్రకారం బాన్సువాడ బస్టాండ్ నుంచి నిజామాబాద్ వెళ్లే ఎక్స్​ప్రెస్​ బస్సు ప్యాసింజర్లతో నిండి ఉంది. కండక్టర్, డ్రైవర్ కు కంట్రోలర్ వద్దకు వెళ్తానని సైగ చేసి చెప్పాడు. కండక్టర్ బస్సు ఎక్కాడని భావించిన డ్రైవర్, బస్సును ముందుకు పోనిచ్చాడు.

అలా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నెమ్లి వరకు బస్సు తోలాడు. కండక్టర్ లేడని ప్యాసింజర్లు చెప్పడంతో అక్కడే బస్సును ఆపాడు. కండక్టర్ వచ్చే వరకు ఆలస్యమవుతుందని భావించి, ప్యాసింజర్లను వేరే బస్సులో ఎక్కించి నిజామాబాద్ కు తరలించాడు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని డీఎం తెలిపారు.