ఆదిలాబాద్లో చివరి రోజు నామినేషన్ల జోరు

ఆదిలాబాద్లో చివరి రోజు నామినేషన్ల జోరు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో చివరి రోజు నామినేషన్లు  భారీగా దాఖలయ్యాయి. ఆదిలాబాద్​లో కాంగ్రెస్​ సీని యర్​ నాయకుడు, దివంగత మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి మేనల్లుడు సంజీవరెడ్డి  కాంగ్రెస్​ రెబల్​ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్​ వేశా రు.  కార్యక్రమంలో  ఏఐసీసీ మాజీ మెంబర్​ గండ్రత్​ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్​ఖాన్​, కౌన్సిలర్​ అశోక్​, తదితరులు పాల్గొన్నారు.

బోథ్ లో.. 

నేరడిగొండ , వెలుగు : బోథ్ మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్  అభ్యర్థి అనిల్ జాదవ్ తరపున ఆయన కుమారులు అర్జున్ , ఆర్యన్ నామినేషన్  దాఖలు చేశారు . ఈ సందర్భంగా  రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్ పాయ్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు .  కార్యక్రమంలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ , సర్పంచుల సంఘం అధ్యక్షుడు పెంట వెంకటరమణ , వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు . 

 నిర్మల్​లో మహేశ్వర్ రెడ్డి నామినేషన్

నిర్మల్, వెలుగు:  నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం  నామినేషన్   దాఖలు చేశారు.  నామినేషన్ లో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.  అలాగే కాంగ్రెస్ అభ్యర్థి  కే. శ్రీహరి రావు తన నామినేషన్ దాఖలు చేశారు. 

ఇండిపెండెంట్ గా  కోట్నాక్ విజయ్ 

ఆసిఫాబాద్, వెలుగు :  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నాక్ విజయ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. 
ఆసిఫాబాద్  ,వెలుగు : జిల్లాలో నామినేషన్ల చివరి రోజు అభ్యర్థులు  పోటెత్తారు. 

ఆసిఫాబాద్ నియోజకవర్గానికి శుక్రవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కోవ లక్ష్మి, బీఎస్పీ నుంచి కనక ప్రభాకర్, బహుజన్ ముక్తి పార్టీ నుంచి భూక్య పల్లవి, బీజేపీ తరపున అజ్మీర ఆత్మరామ్ , ఆబాద్ పార్టీ , ఇండిపెండెంట్ గా కోట్నాక్ విజయ్ కుమార్, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి నూనవత్ తిరుపతి, ప్రజా శాంతి పార్టీ , ఇండిపెండెంట్ గా  అజ్మీర రామ్ నాయక్, జనతా కాంగ్రెస్ నుంచి భూక్య గోవింద్ రెండు సెట్లు  నామినేషన్​ వేశారు. ఇండిపెండెంట్ లుగా మడావి ఆనంద్ ఈశ్వర్ , సోనేరావు , నాగరాజు, కోట్నాక్ కిషన్ రావు, వసంత్ సింగ్ జాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.  మొత్తం 31 నామినేషన్లు వచ్చినట్లు ఆర్వో వేణు పేర్కొన్నారు.

సిర్పూర్ లో..

సిర్పూర్ అసెంబ్లీ స్థానానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ తరపున రావి శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కోనేరు కృష్ణారావు, బీజేపీ నుంచి హరీశ్​బాబు, జాడి దీపక్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా ప్రభుద్ద, రిపబ్లికన్ పార్టీ తరపున రంటెంకి అజయ్ కుమార్, భారత ప్రజకీయ పార్టీ తరపున జాడి శ్యామ్ రావ్, యుగ తులసీ పార్టీ తరపున లలిత్ బళ్హోత్రా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున దోంగ్రే ప్రవీణ్ కుమార్ నామినేషన్​ వేశారు. 

గొంద్వానా గణతంత్ర పార్టీ తరపున పర్చాకే కేశవ్ రావు, సోషలిస్ట్ పార్టీ  ఇండియా తరపున సోదరి నిరంజన్, ఆబాద్ పార్టీ తరపున నందిపేట విలాస్, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరపున దాసరి వెంకటేశ్,  ఇండిపెండెంట్ గా సాంబశివ గౌడ్, సభాని ముక్తేశ్, మనోహర్ ఎల్ములే, కసనగొట్టు సంతోష్   నామినేషన్లను ఆర్వో దీపక్ తివారీ కి సమర్పించారు. చివరిరోజున 19 నామినేషన్లు దాఖలయ్యాయి.  కాగా  మొత్తం దాఖలైన నామినేషన్ల సంఖ్య 35 గా ఉంది.