బోనులో చిక్కిన చిరుత

బోనులో చిక్కిన చిరుత
  • నారాయణపేట మరికల్ మండలంలో ఘటన
  • నాగర్ కర్నూల్ అడవుల్లో వదిలేసిన అధికారులు

మరికల్/లింగాల, వెలుగు : నారాయణపేట జిల్లా మరికల్​ మండలంలోని రాకొండ గ్రామం సమీపంలో గుట్టల్లో సంచరిస్తున్న చిరుతపులి అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో​చిక్కింది. పొలాల మధ్య చిరుత తిరుగుతుండడంతో రైతులు భయంభయంగా గడిపారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు అటవీ అధికారులు శుక్రవారం చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు. ఆదివారం చిరుత బోనులో చిక్కింది. అనంతరం  ప్రత్యేక వాహనంలో చిరుతను తరలించారు. నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి బేస్  క్యాంప్​ సమీపంలో గోర్జా గుండాల వద్ద చిరుతను వదిలిపెట్టారు. డీఎఫ్ఓ వీణవాణి, ఎఫ్ఆర్ఓ నారాయణరావు, ఎస్ఐ హరిప్రసాద్​రెడ్డి చిరుత తరలింపును పర్యవేక్షించారు.