భార్యను కాపాడుకోవడానికి షార్క్ తో ఫైట్

భార్యను కాపాడుకోవడానికి షార్క్ తో ఫైట్

సిడ్నీ(ఆస్ట్రేలియా): సరదాగా సర్ఫింగ్ చేయడానికి సముద్రం లోకి వెళ్లిన భార్యాభర్తలకు భారీ షార్క్​ ఒకటి షాకిచ్చింది. వారిపై దాడిచేసి, భార్య కాలును దొరకబుచ్చుకుంది. దీంతో భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త ఏకంగా షార్క్​తోనే ఫైట్ చేసిండు. ఆస్ట్రేలియాలోని పోర్ట్ మాక్వెరీ లో ఈ ఘటన వివరాలను అక్కడి పోలీసులు మీడియాకు చెప్పారు. పోర్ట్ మాక్వెరీ టౌన్ లో మార్క్​ రాప్లే అనేటాయన తన భార్యతో కలిసి బీచ్ కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి సముద్రంలో సర్ఫింగ్ చేస్తుండగా.. దాదాపు పది అడుగుల పొడవున్న భారీ షార్క్​ ఒకటి దాడి చేసింది. ఫస్ట్ టైం తప్పించుకున్నా .. రెండోసారి అటాక్ చేసినపుడు రాప్లే ​భార్య కాలు షార్క్​ నోటికి చిక్కింది. దీంతో ఆమె ప్రాణభయంతో కేకలు వేస్తుండగా.. రాప్లే వేగంగా రియాక్ట్ అయిండు. షార్క్​ మీద కలబడి, పిడిగుద్దులు కురిపించిండు. భార్యను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి, ఫైట్ చేసిండు. రాప్లే దాడితో బెదిరిపోయిన షార్క్.. ఆయన భార్య కాలును విడిచి పరారైంది. అక్కడికి దగ్గర్లోనే సర్ఫింగ్ చేస్తున్న మరో వ్యక్తి ఈ సంఘటనను చూశాక మార్క్​ రాప్లేను హీరో అని మెచ్చుకున్నడు. రాప్లే మాత్రం.. ఆ టైంలో ఎవరైనా అదేపని చేస్తారని సింపుల్ గా తీసేసిండు. కాగా, షార్క్​ దాడిలో గాయపడ్డ రాప్లే భార్యకు ఫస్ట్ ఎయిడ్ చేసి, ఎయిర్ ఆంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.