మరో ఐఏఎస్ అధికారిణికి వేధింపులు.. మేడం అభిమాని అంటూ ఇంటి వద్ద హంగామా

మరో ఐఏఎస్ అధికారిణికి వేధింపులు.. మేడం అభిమాని అంటూ ఇంటి వద్ద హంగామా

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో నివాసం ఉండే ఓ మహిళా ఐఏఎస్ అధికారికి వేధింపులు ఎదురైన ఘటన మరిచిపోక ముందే మరో మహిళా ఐఏఎస్ కు వేధింపుల ఘటన బయటపడింది. సికింద్రాబాద్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ ఐఏఎస్ అధికారిణి ఇంటిముందు శివప్రసాద్ అనే వ్యక్తి ప్రత్యక్ష్యమయ్యాడు. తన డ్యూటీ విషయం గురించి కొంతకాలంగా శివప్రసాద్ తరచూ మహిళా ఐఏఎస్ ను కలిసేందుకు ఆమె కార్యాలయానికి వెళ్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. ఆఫీసులోకి శివప్రసాద్ ను అనుమతించవద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

ALSO READ:  పాక్ టెర్రరిస్టులను కాల్చి చంపిన భారత్ జవాన్లు

అయితే.. ఆఫీస్ లోపలికి తనను అనుమతించకపోవడంతో నేరుగా ఐఏఎస్ అధికారిణి ఇంటికి వెళ్లాడు శివప్రసాద్. ఇంటికి వెళ్లి మేడమ్ ను కలవాలంటూ హంగామా చేశాడు. ఐఏఎస్ అధికారిణికి తాను సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ అంటూ నానా యాగీ చేశాడు.  వెంటనే సదరు అధికారిణి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో మోండా మార్కెట్  పోలీస్ స్టేషన్ లో శివప్రసాద్ పై కేసు నమోదైంది.