వాగు దాటుతూ యువకుడు గల్లంతు.. మహబూబ్ నగర్ జిల్లా ఇస్రంపల్లి – కౌకుంట్ల మధ్యలో ఘటన

వాగు దాటుతూ యువకుడు గల్లంతు.. మహబూబ్ నగర్ జిల్లా ఇస్రంపల్లి – కౌకుంట్ల మధ్యలో ఘటన

చిన్నచింతకుంట, వెలుగు: వాగు దాటుతూ యువకుడు గల్లంతైన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. దేవరకద్ర ఎస్ఐ నాగన్న, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన మంగలి రమేశ్(30), కౌకుంట్ల మండలం ఇస్రంపల్లికి చెందిన గుంపు మేస్త్రీ వద్ద కొన్నాళ్లుగా పని చేస్తున్నాడు.  మంగళవారం మధ్యాహ్నం మేస్త్రీ భార్య అలివేలుతో కలిసి రమేశ్ నడుచుకుంటూ వెళ్తూ ఇస్రంపల్లి – కౌకుంట్ల మధ్యలోని వాగు దాటేందుకు యత్నించగా అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది వద్దని చెప్పినా వినలేదు. అలాగే వాగు దాటుతుండగా ఇద్దరు గల్లంతయ్యారు. స్థానికులు అలివేలును తాడు సాయంతో రక్షించగా.. రమేశ్​ కొట్టుకుపోయాడు. సమాచారం తెలియడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు వెళ్లి గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. రాత్రి కావడంతో నిలిపివేశారు.