ఏపీలో విజృంభిస్తున్న కరోనా కేసులు

ఏపీలో విజృంభిస్తున్న కరోనా కేసులు
  • వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 70 మందికి పాజిటివ్‌
  • విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 465 కేసులు నమోదయ్యాయి. మొత్తం 17,609 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. పాజిటివ్‌ వచ్చిన 70 మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారని, మరో 19 మంది ఫారెన్‌ నుంచి వచ్చిన వారు ఉన్నట్లు అధికారులు చెప్పారు. అంటే రాష్ట్రంలోని 376 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పొరగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, రాష్ట్రంలోని వారితో కలిసి మొత్తం కేసుల సంఖ్య 7,961గా ఉంది. వ్యాధిన బారిన పడి 24 గంటల్లో నలుగురు చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 96కి చేరింది. 3065 మంది డిశ్చార్జ్‌ అవ్వగా.. 3069 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.