ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ దాడి

ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ దాడి

ఢిల్లీ : ఢిల్లీ మున్సిపోల్స్ ఎన్నికల వేళ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ దాడి కలకలం రేపుతోంది. మటియాలా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ రాత్రి 8 గంటల సమయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు.. గానీ ఓ వ్యక్తి వచ్చి.. ఆప్ ఎమ్మెల్యేపై దాడికి దిగాడు. గొడవ ఎందుకు జరిగిందనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మున్సిపల్ ఎన్నికలపై ఆప్-, బీజేపీ పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. తామే అధికారం చేపడుతామని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేపై దాడి కలకలం రేగింది. దీనిపై ఇప్పటివరకు ఆప్ స్పందించలేదు. 

మున్సిప‌ల్ టికెట్లు అమ్మినందుకు సొంతం పార్టీ కార్య‌క‌ర్త‌లే ఎమ్మెల్యేపై దాడి చేసిన‌ట్లు బీజేపీ ఆరోపిస్తున్నా.. ఆ ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్యే గులాబ్‌సింగ్ కొట్టిపారేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లే ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.