ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చండి.. ఈసీకి ఆప్ లేఖ

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చండి.. ఈసీకి ఆప్ లేఖ

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని అభ్యర్థిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఛత్ పండుగ నేపథ్యంలో పోలింగ్ తేదీని నవంబర్ 17 నుంచి నవంబర్ 25కి మార్చాలని ఈసీకి రాసిన లేఖలో ఆప్ ప్రతిపాదించింది. అంతకుముందు రోజు బీజేపీ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం  రమణ్ సింగ్ కూడా ఛత్ పండుగ దృష్ట్యా నవంబర్ 17 న జరగాల్సిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. 

ALSO READ : కసబ్ను చూసి ఉగ్రవాది అనుకోలేదు.. అతనికి మాత్రం బిర్యానీ పెట్టలేదు

ఈ సంవత్సరం ఛత్ పండుగ నవంబర్ 17 నుండి నవంబర్ 20 వరకు నిర్వహించబడుతుంది. ఈ క్రమంలో  పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్ వేయడానికి ఆసక్తి కనబరుచరని పార్టీలు అంచానా వేస్తున్నాయి.  ఛత్ పండుగను  ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు చాలా గొప్పగా జరుపుకుంటారు. కాగా 90 మంది సభ్యుల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7న తొలి విడత పోలింగ్, 17న రెండో విడత పోలింగ్ జరగనున్నాయి.   డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.