వనపర్తి  ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

వనపర్తి  ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

వనపర్తి టౌన్, వెలుగు:  తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా తరలివచ్చిన కార్యకర్తలు ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు నెలకు రూ. 18 వేల ఫిక్స్‌‌‌‌ డ్ వేతనం అమలు చేయాలని, ప్రతినెలా 1న జీతాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పని భారం తగ్గించి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.