ట్రీట్​మెంట్​ లేకుండానే 80 శాతం క్యూర్

ట్రీట్​మెంట్​ లేకుండానే 80 శాతం క్యూర్

జెనీవాకరోనా సోకిన వారిలో 80 శాతం మంది ట్రీట్​మెంట్​ లేకుండానే క్యూర్ అవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్యూహెచ్ఓ) ప్రకటించింది. వైరస్​ ఓవర్​లోడ్​ అయిన వారు మినహా మిగతా వారంతా ఏ ట్రీట్​మెంట్​లేకుండానే కోలుకుంటారని తెలిపింది. కరోనా ప్రభావం ప్రారంభమైన నాటి నుంచి డబ్ల్యూహెచ్ఓ ట్విట్టర్ ద్వారా దాదాపు 60 లక్షల  మంది కరోనాపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. వీటిలో ఎక్కువగా అడిగిన 14  ప్రశ్నలకు సమాధానాలను ట్విట్టర్ ద్వారా గురువారం  వెల్లడించింది.  కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లక్షణాలను వివరించింది. ఏ వయసు వారికైనా కరోనా సోకుతుందని, వేడి వాతావారణంలో వైరస్ బతకదన్నది నిజం కాదని స్పష్టం చేసింది. ఆస్తమా, డయాబెటిస్, హార్ట్ డిసీస్ ఉన్న వారికి రిస్క్ ఎక్కువని తెలిపింది. మాస్క్ ఉన్నా.. సోషల్ డిస్టెన్స్ కనీసం మీటర్ దూరం పాటించాలని కోరింది. పలు ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని వ్యాక్సిన్ వచ్చేందుకు మరింత సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఓ సమాధానమిచ్చింది.