ఏసీబీ దాడులు: కుమారుడి అరెస్ట్... జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు.. 

ఏసీబీ దాడులు: కుమారుడి అరెస్ట్... జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు.. 

వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అధికారులు. తమపై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పల్కపడుతోందని, తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారని రాజీవ్ అన్నారు.

విజయవాడలోని గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ కు తరలించి అగ్రిగోల్డ్ భూముల కొనుగోలుపై రాజీవ్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు.ఈ నేపథ్యంలో కుమారుడి అరెస్ట్ పై స్పందించిన జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కుట్రపూరితమైన చర్య అని, తన కుటుంబాన్ని రోడ్డుకు లాగేందుకే ఆ అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు.

అటాచ్మెంట్ లో ఉన్న భూములను కొన్నామంటూ తమపై నింద మోపటం పెద్ద బూతు అని అన్నారు. అందరూ కొన్నట్లే తాము భూములు కొన్నామని, భూములు కొన్న సమయంలో పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చామని అన్నారు. కొంత కాలం తర్వాత ఆ భూములను వేరొకరికి విక్రయించామని అన్నారు.