
వికారాబాద్, వెలుగు: ఫర్టిలైజర్ షాపు పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఉమ్మడి రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన ప్రకారం..
మోమిన్‌పేట మండలకేంద్రంలో కొత్తగా ఫర్టిలైజర్ షాప్ పెట్టుకోవడానికి ఓ వ్యక్తి మండల వ్యవసాయ శాఖాధికారి భూపతి జయశంకర్‌ను పర్మిషన్ కోరాడు. అందుకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేని చెప్పడంతో రూ.50 వేలకు అంగీకరించారు. బాధితుడు బుధవారం రూ.50 వేలు జయ శంకర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.