డబ్బులతో పట్టుబడిన వారికి బిగ్ రిలీఫ్... రూ.10 లక్షలు దాటితేనే ఐటీకి లెక్క చెప్పాలి

డబ్బులతో పట్టుబడిన వారికి బిగ్ రిలీఫ్...  రూ.10 లక్షలు దాటితేనే ఐటీకి లెక్క చెప్పాలి
  • అంతకు తక్కువ పట్టుబడితే ఆధారాలు చూపించాలి 
  • మీడియాతో ఐటీ డీజీ సంజయ్‌‌ బహదూర్‌‌‌‌  
  • ఇప్పటివరకు 156 కిలోల బంగారం, 454 కిలోల వెండి సీజ్‌‌  
  • రూ.1.76 కోట్లకు మాత్రమే లెక్కలు లేవని తేల్చిన ఐటీ 
  • అంతకు తక్కువ పట్టుబడితే ఆధారాలు చూపి తీసుకోవాలె 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడుతున్న డబ్బు, బంగారానికి సంబంధించి ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ స్పందించింది. రూ.10 లక్షలకుపైగా పట్టుబడినప్పుడు మాత్రమే ఐటీ పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. అంతకంటే తక్కువ డబ్బు దొరికితే ఐటీ శాఖ దర్యాప్తు చేయదని వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ డీజీ సంజయ్‌‌‌‌ బహదూర్‌‌‌‌‌‌‌‌ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎలక్షన్‌‌‌‌ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఎలక్షన్‌‌‌‌ సీజర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌(ఈఎస్‌‌‌‌ఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌) యాప్‌‌‌‌ ద్వారా ఈసీ, పోలీసులతో కోఆర్డినేట్ చేస్తున్నామని చెప్పారు. రూ.10 లక్షలకు మించిన డబ్బు పట్టుబడినప్పుడు మాత్రమే స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆధారాలు సమర్పిస్తే సీజ్ చేసిన డబ్బును తిరిగి అప్పగిస్తున్నామని చెప్పారు.   

పట్టుకున్న డబ్బులో రూ.1.76 కోట్లు సీజ్‌‌‌‌  

ఐటీ ఇంటెలిజెన్స్‌‌‌‌కు అందిన సమాచారంతో హైదరాబాద్‌‌‌‌లోని ఓ ఇంటిపై ఇటీవల సోదాలు చేశామని సంజయ్‌‌‌‌ చెప్పారు. ఈ సోదాల్లో ఐటీ అధికారులు రూ.14.8 కోట్లు పట్టుకున్నట్టు తెలిపారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే వివరాలు సేకరిస్తున్నామని, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందన్నారు. ఇక కోడ్‌‌‌‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి మంగళవారం వరకు పోలీసులు, ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌టీ నిర్వహించిన తనిఖీల్లో మొత్తం రూ.53.93 కోట్ల నగదు,156 కిలోల బంగారం, 454 కిలోల వెండి పట్టుబడిందని ఆయన వెల్లడించారు. ఈఎస్‌‌‌‌ఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా వివరాలు సేకరించామన్నారు. ఇందులో ఎలాంటి డాక్యుమెంట్స్‌‌‌‌ లేని రూ.1.76 కోట్లు మాత్రమే సీజ్ చేసినట్లు వివరించారు. మిగతా డబ్బు, గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌ను సంబంధిత వ్యక్తులకు అప్పగించామన్నారు.    

ఆధారాలు చూపి డబ్బు తీసుకోవాలె 

ప్రజల దగ్గర రూ.50 వేలు దొరికినా, ఇతర అవసరాల కోసం డబ్బులు తీసుకెళ్తున్నా పోలీసులు పట్టుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ చెప్పారు. రూ. 10 లక్షలు దాటితెనే ఐటీకి లెక్కలు చెప్పాల్సి ఉంటుందని.. అంతకంటే తక్కువ డబ్బు పట్టుబడితే స్థానిక గ్రీవెన్స్ సెల్ అధికారులకు ఆధారాలు చూపి తిరిగి తీసుకోవాలని సూచించారు. వ్యాపారం, పెళ్ళిళ్లు, వేడుకలు, వస్తువుల కొనుగోళ్లకు డబ్బు తీసుకెళ్తున్న వాళ్లను, గోల్డ్‌‌‌‌ వ్యాపారులను తాము వేధించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బ్యాంక్ ట్రాన్సాక్షన్లపైనా నిఘా ఉంటుందన్నారు.

అఫిడవిట్లు,హెలికాప్టర్ ట్రిప్పులపైనా నిఘా  

అభ్యర్థుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, హెలికాప్టర్ ట్రిప్పులకు అయ్యే ఖర్చులపై కూడా తమ నిఘా ఉంటుందని ఐటీ డీజీ సంజయ్ చెప్పారు. అభ్యర్థుల అఫిడవిట్లలోని సమాచారం ఆధారంగా ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరిస్తామన్నారు. ఆ డేటాను ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌కు అప్పగిస్తామని వెల్లడించారు. ఎన్నికల తర్వాత కూడా ఈసీకి సమాచారం అందిస్తామన్నారు. ఎవరైనా అక్రమంగా డబ్బు తరలిస్తున్నట్లు తెలిస్తే టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్స్ (‌‌‌‌1800 ‌‌‌‌‌‌‌‌425 1785/040 23426201/23426202)కు కాల్‌‌‌‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.7013711399 వాట్సాప్‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌కి కూడా వివరాలు షేర్ చేయొచ్చని తెలిపారు.