
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలిక పై ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి యాసిడ్‌తో దాడి చేశారు. యాసిడ్ మీద పడటంతో మొహం అంతా కాలిపోయి బాధితురాలు కేకలు వేస్తూ రోడ్డుపైనే కుప్పకూలింది. ఈ ఘటనలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవాళ ఉదయం ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో ప్లస్ 12 చదువుతున్న బాలిక పాఠశాలకు వెళుతోంది. ఆ సమయంలో పాఠశాల విద్యార్థులు తప్ప ఎక్కువగా రద్దీ లేదు. ఇప్పుడే ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి.. తమ వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాలిక మొహంపై పోసి పారిపోయారు. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు