
కరోనాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా తోడు కావడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తనకు తాను ఐసోలేట్ అయినట్టు... అలాగే కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇటీవల కాలంలో తనని కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలన్నాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ కచ్చితంగా ధరించాలని తెలిపాడు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు అర్జున్.