
బెంగళూరులో సీఏఏ ను వ్యతిరేకిస్తూ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమూల్య లియోనా అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్ చేసింది. ఆ స్లోగన్లపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ ఆమెను వారించే ప్రయత్నం చేశారు. తాము భారతీయులమని యువతి వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఓవైసీ ..యువతితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
అమూల్య వ్యాఖ్యలపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ ద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని కోర్ట్ లో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్ట్ 14రోజుల కస్టడి విధించింది. మరోవైపు అమూల్య వ్యాఖ్యలతో కొంతమంది చిక్ మంగళూరులోని ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దాడి ఘటనపై అమూల్య తండ్రి ఏఎన్ ఐ తో మాట్లాడుతూ తాము ఎంతచెప్పినా వినకుండా ముస్లీంలతో కలిసి సీఏఏ వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుందన్నారు. దేశ ద్రోహం కేసులో అరెస్టైన తన కూతురు అమూల్య కోసం బెయిల్ కోసం ట్రై చేయడం లేదన్నారు.