
సినిమాల్లోని బైక్ రైడ్ సీన్స్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంటారు మన స్టార్స్. కానీ రియల్ లైఫ్‌లో అలా డ్రైవ్ చేయడం అందరు హీరోలకీ సాధ్యం కాకపోవచ్చు. కానీ అజిత్ మాత్రం సోలోగా బైక్‌పై లాంగ్ జర్నీ చేస్తుంటాడు. బైక్స్‌ని అంతలా ఇష్టపడతాడు. తన ఇష్టానికి తగ్గట్టే ‘వలిమై’లో బైక్ రేసర్ క్యారెక్టర్ దొరికింది అజిత్‌కి. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మేకింగ్ విజువల్స్‌ని నిన్న విడుదల చేశారు. ఇందులోని ఓ సీన్‌లో బైక్ స్టంట్స్ చేస్తూ జారిపడ్డాడు అజిత్. అయినా లెక్క చేయకుండా తిరిగి లేచి, అంతే ఎనర్జీతో ఆ సీన్‌ని కంప్లీట్ చేశాడు. స్పోర్ట్స్ బైక్స్‌తో తీసిన ఆన్ రోడ్ చేజింగ్ సీన్స్ యాక్షన్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. విలన్ పాత్ర కోసం కండలు తిరిగిన బాడీతో కార్తికేయ పడ్డ కష్టం కూడా ఈ వీడియోలో కనిపించింది. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో హ్యుమా ఖురేషీ హీరోయిన్. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.