
ప్రముఖ హాస్యనటుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (74) కన్నుమూశారు. ఆయన గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. ఈ రోజు ఉదయం బాత్రూంకి వెళ్లిన ఆయన.. అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల. ఆయన అక్టోబర్ 10, 1946న జన్మించారు. రాయలసీమ యాసతో విలన్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన 1988లో బ్రహ్మపుత్రుడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రాకముందు ఆయన టీచర్‌గా పనిచేశారు. ఆయనకు మొదటినుంచి నాటకాలంటే అభిమానం. ఆ అభిమానంతోనే సినిమాలలోకి ప్రవేశించారు. ఆయన సమరసింహా రెడ్డి, జంబలకిడి పంబ, జయం మనదేరా, ఛత్రపతి, ఎవడిగోల వాడిదే, సరిలేరు నీకేవ్వరు మొదలైన చిత్రాలలో నటించారు. దాదాపు 100 సినిమాలలో నటించిన ఆయనకు సరిలేరు నీకేవ్వరు చివరి చిత్రం.
For More News..