ప్రముఖ దిగ్గజ నిర్మాత, AVM నిర్మాణ సంస్థ అధినేత M.శరవణన్ ఇవాళ కన్నుమూశారు. గురువారం (డిసెంబర్ 4, 2025న) ఉదయం 5.30 గంటలకు చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. ఎల్లప్పుడూ తెల్లటి దుస్తులు.. నుదటి ఫై బొట్టు.. సున్నితమైన మాటలతో అందరికీ ఎంతో దగ్గరయ్యారు నిర్మాత శరవణన్. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు శరవణన్ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ అవుతున్నారు.
హీరో సూర్య తన తండ్రి శివకుమార్‌తో కలిసి శరవణన్ భౌతికకాయాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సూర్య కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో నిర్మాత శరవణన్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, రజనీకాంత్ తదితరులు నిర్మాత శరవణన్ భౌతికకాయానిక నివాళులర్పించారు
86 సంవత్సరాల వయసు గల శరవణన్.. వృద్దాప్య సంబంధిత వ్యాధుల కారణంగా మరణించినట్లు కుటుంబ సభ్యుల సమాచారం. శరవణన్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు నిర్మించి దిగ్గజ నిర్మాతగా ఎదిగారు. ఆయన మృతి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. అనేక దశాబ్దాలుగా సినిమాను రూపొందించడంలో తనదైన పాత్ర పోషించిన శరవణన్ లేని లోటుతో ఒక శకం ముగిసింది. ఈ క్రమంలో ఇండియన్ సినీ పరిశ్రమప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
నిర్మాత, M.శరవణన్ సినీ ప్రస్థానం:
1945లో ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు-నిర్మాత AV మెయ్యప్పన్ AVM ప్రొడక్షన్స్ స్థాపించారు. ఆయన తమిళ సినిమా మార్గదర్శకులలో ఒకరిగా ప్రఖ్యాతిగాంచారు. ఆ తర్వాత తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. నిర్మాణ బాధ్యతలను M.శరవణన్ చూసుకుంటూ దిగ్గజ నిర్మాతగా ఎదిగారు. అలాగే, AVM శరవణన్ 1986లో మద్రాస్ షెరీఫ్‌గా ప్రజలకు కూడా ఎన్నో సేవలు చేస్తూ తన ఉదారతను చాటుకున్నారు.
►ALSO READ | Naresh : ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. '90ల్లోనే ప్రయాణం సేఫ్ గా ఉండేదంటూ ఫోస్ట్!
అలనాటి సూపర్ స్టార్స్ అయినా శివాజీ గణేషన్, ఎంజీఆర్, రజినీకాంత్ వంటి ప్రముఖ నటులను కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తిగా శరవణన్ నిలిచారు. మొత్తం ఆయన ఇండియాన్ భాష చిత్రాల్లో సుమారుగా 300కి పైగా చిత్రాలను నిర్మించారు.
తెలుగులో ఆల్ టైం సూపర్ హిట్ కుటుంబ కథా చిత్రం అయిన "సంసారం ఒక చదరంగం", రాజేంద్ర ప్రసాద్ ఠీ " ఆ ఒక్కటి అడక్కు", హీరో వెంకటేష్ తో " జెమిని", రజినీకాంత్ హీరోగా " శివాజీ", రానా " లీడర్", "బామ్మ మాట బంగారు బాట", "మెరుపు కలలు" వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం AVM ప్రొడక్షన్స్ బాధ్యతలను ఆయన కుమారుడు M. S.Guhan చూసుకుంటున్నారు.
