మసూద, ప్రీ వెడ్డింగ్ సినిమాలతో అలరించిన హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనరావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభ సందర్భాన్ని (2025 డిసెంబర్ 12న) పంచుకుంటూ హీరో తిరువీర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘నాయినొచ్చిండు❤️’ అంటూ ఉప్పొంగే సంతోషంతో బిడ్డ చేతిని పట్టుకున్న ఓ ఫోటో షేర్ చేశాడు.
నాయినొచ్చిండు ❤️ pic.twitter.com/7IzM5OAE03
— Thiruveer (@iamThiruveeR) December 12, 2025
ఈ క్రమంలో ఫోటో వైరల్ అవగా.. నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నెలలోనే (నవంబర్ 7న) ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో అఖండ విజయం అందుకున్నారు. ఈ తరుణంలోనే బిడ్డకు తండ్రి అవ్వడంతో తిరువీర్ ఆనందానికి అవధులు లేవు. ఇకపోతే తాను ప్రేమించిన ఆమ్మాయి కల్పన రావుతో 2024 ఏప్రిల్ 21న వివాహబంధంలోకి అడుగుపెట్టాడు తిరువీర్. ఇరు కుటుంబాల మధ్య ఎంతో ఘనంగా జరిగింది వీరి పెళ్లి.
►ALSO READ | 3 Roses OTT: ఆహా ఓటీటీలో ఈషా రెబ్బా ‘త్రీ రోజెస్ సీజన్2 ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తిరువీర్ సినిమాలు.. ‘మసూద’వంటి హారర్ థ్రిల్లర్ తో తిరువీర్ (Thiruveer) హీరోగా ఎంట్రీ ఇచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో, తెలుగు ఇండస్ట్రీలో తిరువీర్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 2023లో వచ్చిన తెలంగాణ యాస కామెడీ చిత్రం 'పరేషాన్'లో హీరోగా తనదైన మార్కు నటనతో మంచి మార్కులు కొట్టేయడమే కాక, ‘కుమారి శ్రీమతి’వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను కూడా పలకరించారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఐశ్వర్య రాజేష్‌తో కలిసి నటిస్తున్న సినిమా ఒకటి. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ‘ఓ..! సుకుమారి’ అనే టైటిల్‌తో వస్తుంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

