నటి లక్ష్మీ మీనన్‌కు ఊరట.. కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు!

నటి లక్ష్మీ మీనన్‌కు ఊరట.. కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు!

'చంద్రముఖి 2', 'శబ్దం' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి లక్ష్మీ మీనన్, ఓ కిడ్నాప్ కేసులో చిక్కుకున్నారు. కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేశారన్న ఆరోపణలు ఆమెపై వచ్చాయి. ఈ కేసులో లక్ష్మీ మీనన్‌తో పాటు ఆమె స్నేహితులు ముగ్గురు నిందితులుగా ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే, కొచ్చిలోని ఒక బార్ వద్ద లక్ష్మీ మీనన్, ఐటీ ఉద్యోగి బృందాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో గొడవ సద్దుమణిగినట్లు కనిపించినా, ఆ తర్వాత లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి ఆ ఉద్యోగిని వెంబడించారు. అతడి కారును అడ్డగించి, బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని తీసుకువెళ్లి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.

నిందితుల్లో ఒకరిగా ఉన్న నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.  ఇదిలా ఉండగా లక్ష్మీమీన న్ ముందస్తు బెయిల్ కోసం కేరళ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యా యస్థానం ఆమెకు సానుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 17వరకు ఆమెను అరెస్ట్ చేయవ ద్దని పోలీసులకు సూచించింది.

►ALSO READ | సొంత ఇంటినే ప్రియురాలికి అద్దెకిచ్చిన బాలీవుడ్ హీరో.. మరి ఇంత చీప్ గానా!

ప్రస్తుతం, లక్ష్మీ మీనన్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆమెకు తాత్కాలికంగా ఊరట లభించింది. అయితే, ఈ కేసులో తదుపరి విచారణ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఒక నటి కిడ్నాప్ కేసులో ఇరుక్కోవడం, కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సినీ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.