శభాష్​ అనాల్సిందే!

శభాష్​ అనాల్సిందే!

వరుస లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌‌తో దూసుకుపోతున్న తాప్సీ, సంవత్సరానికి కనీసం మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకులు ముందుకొస్తోంది. ఈ ఇయర్ ఇప్పటికే లూప్‌‌ లపేటా, మిషన్ ఇంపాజిబుల్‌‌ మూవీస్ రిలీజయ్యాయి. వచ్చే నెలలో ‘శభాష్ మిథూ’ సినిమాతో రాబోతోంది. ఫేమస్ క్రికెటర్ మిథాలీ రాజ్‌‌ బయోపిక్ ఇది. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. జులై 15న విడుదల. నిన్న ట్రైలర్‌‌‌‌ను వదిలారు. చిన్నప్పుడే క్రికెటర్ అవ్వాలని డిసైడ్ అవుతుంది మిథాలీ. మహిళలు క్రికెట్ ఆడటాన్ని తప్పుబట్టేవారందరికీ తన బ్యాట్‌‌తోనే ఎలా జవాబు చెప్పింది, కెప్టెన్‌‌గా ఎలా ఎదిగింది అనేది ఈ మూవీ కథ. ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని మార్చుకోకుండా ఎంత కష్టపడిందో.. మహిళా క్రికెట్ జట్టుకు గుర్తింపు రావడం కోసం ఎంతలా తపించిందో చూపించే సీన్స్‌‌తో ట్రైలర్‌‌‌‌ను కట్ చేశారు. ‘మెన్ ఇన్ బ్లూ మాదిరిగానే మనకి కూడా విమెన్ ఇన్ బ్లూ అనే టీమ్ ఉంటే బాగుంటుంది’ అంటూ చెప్పే డైలాగ్ ఇంప్రెస్ చేసింది. మిథాలీ పాత్రలో తాప్సీ ఒదిగిపోయిందని అర్థమవుతోంది. మిథాలీ కథని అందరి ముందుకీ తీసుకొస్తున్నందుకు గర్వపడుతున్నానంటోందామె. ‘శభాష్ మిథూ’ చూశాక అందరూ శభాష్ తాప్సీ అనడం ఖాయమని టీమ్ కూడా చెబుతోంది. ఇక జన గణ మన, దొబారా, ఏలియన్, బ్లర్, వో లడ్‌‌కీ హై చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది తాప్సీ.  షారుఖ్‌‌తో కలిసి ‘డంకీ’ మూవీ కూడా చేస్తోంది. తనతో స్టార్‌‌‌‌ హీరోలు నటించడానికి రెడీగా లేరని చాలాసార్లు చెప్పింది తాప్సీ. ఇప్పుడీ సినిమాతో టాప్ హీరోలకి సైతం తాప్సీ బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ అయ్యింది.