Zareen Khan: హీరోయిన్ ఇంట వరుస విషాదాలు.. కన్నీటి కథగా మారిన నటి ఫ్యామిలీ!

Zareen Khan: హీరోయిన్ ఇంట వరుస విషాదాలు.. కన్నీటి కథగా మారిన నటి ఫ్యామిలీ!

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తల్లి, పర్వీన్ ఖాన్ కన్నుమూశారు. బుధవారం ఏప్రిల్ 8న ఉదయం పర్వీన్ ఖాన్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని ఏళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు.

ఇటీవలే, తన తల్లి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో జరీన్ ఖాన్ అప్‌డేట్ ఇచ్చింది. ‘అమ్మ మళ్లీ ఆసుపత్రిలో చేరారు.. దయచేసి ఆమె కోసం ప్రార్థించండి’ అని పోస్ట్ చేసి ఎమోషనల్ అయింది. ఈ క్రమంలోనే జరీన్ ఖాన్ తల్లి కన్నుమూయడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కుటుంబ ప్రకటన

జరీన్ ఖాన్ ఫ్యామిలీ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. “మా ప్రియమైన మిస్ పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్ మరియు సానా ఖాన్ తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్థులయ్యారు” అని తెలిపారు. ఈ కష్టం సమయంలో వ్యక్తిగత గోప్యతకు కుటుంబం కోరింది. 

వరుస విషాదాలు.. 

నటి జరీన్ ఖాన్‌ను ఒకేసారి రెండు విషాదాలు చుట్టుముట్టాయి. తల్లి మృతిచెందే ఒక రోజు ముందే, జరీన్ తన ప్రియమైన పెట్ క్యాట్ రాంబోను కోల్పోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. “నా బిడ్డ నన్ను వదిలి వెళ్లిపోయింది.. తన తోబుట్టువులతో కలవడానికి నన్ను విడిచి వెళ్ళింది. మిస్ య రాంబో” అని పోస్ట్ చేసింది. ఈ విషాద సమయంలో జరీన్ ఖాన్‌ కు తమ అభిమానులు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. 

జరీన్ ఖాన్ కెరీర్

జరీన్ ఖాన్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్. హిందీతో పాటుగా తమిళం, తెలుగు, పంజాబీ సినిమాలలో నటించింది. 2010లో సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘వీర్’ సినిమాలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో గుర్తింపు పొందింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రెడీ’లో నటించి సూపర్‌హిట్ కొట్టింది.

2019లో గోపీచంద్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'చాణక్య' సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఏజెంట్ జుబెదా పాత్రను పోషించింది. అలాగే, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘వీరప్పన్’లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. వీటితో పాటుగా ‘హౌస్‌ఫుల్ 2’, ‘హేట్ స్టోరీ 3’, ‘జాట్ జేమ్స్ బాండ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.