రోజూ ఇలా చేస్తే నిద్రలేమి సమస్య దూరం

రోజూ ఇలా  చేస్తే నిద్రలేమి సమస్య దూరం

పని ఒత్తిడి వల్ల ఎనర్జీ లేనట్టు, నీరసం, అలసట అనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే  ఆక్యుప్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్ప్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ఆక్యుప్రెజర్ వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు ఇంకా చాలా లాభాలున్నాయి. మెడకి కొంచెం పైనా చెవికమ్మ దగ్గర చూపుడు వేళ్లని పెడితే ఎముకలు తగులుతాయి​. వాటిమీద ఐదు నిమిషాలు వేలితో నెమ్మదిగా అదిమి పట్టాలి. ఇలా రోజూ చేస్తే నిద్రలేమితో పాటు ఒత్తిడి, తలనొప్పి లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. 

ఎడమచేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య భాగాన్ని కుడిచేతి బొటనవేలితో నొక్కి పడుతూ 30 సెకండ్లపాటు మసాజ్‌‌‌‌‌‌‌‌ చేయాలి. అలానే కుడిచేతికి కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల బాడీ పెయిన్స్‌‌‌‌‌‌‌‌, తలనొప్పి తగ్గుతాయి. పేగుల్లో సమస్యలు పోతాయి. నెర్వస్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ మీద ఒత్తిడి తగ్గుతుంది.  

కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే దగ్గర చూపుడు వేలితో అదమాలి. లేదా ముక్కును రెండువైపులా చూపుడు వేళ్లతో రుద్దుతూ మెల్లిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమితో పాటు భయం, ఆందోళన, ఒత్తిడి, నీరసం నుండి బయటపడొచ్చు. శ్వాస ఇబ్బందులున్నాపోతాయి.