మరిన్ని ఎయిర్​పోర్టులకు బిడ్స్​: అదానీ గ్రూప్

మరిన్ని ఎయిర్​పోర్టులకు బిడ్స్​: అదానీ గ్రూప్

న్యూఢిల్లీ: దేశంలోని మరిన్ని ఎయిర్​పోర్టులను చేజిక్కించుకోవాలని అదానీ గ్రూప్​ ప్లాన్​ చేస్తోంది. లీడింగ్​ ఎయిర్​పోర్ట్ ఆపరేటర్​గా మారాలనే టార్గెట్​ చేరేందుకు ఇంకా కొన్ని ఎయిర్​పోర్టులకు బిడ్స్​ వేయనున్నట్లు అదానీ ఎయిర్​పోర్ట్స్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ అరుణ్​ బన్సాల్​ వెల్లడించారు. కిందటిసారి ప్రభుత్వం బిడ్స్​ పిలిచినప్పుడు అదానీ ఎయిర్​పోర్ట్స్​ ఏకంగా ఆరు ఎయిర్​పోర్టులను దక్కించుకుంది. రాబోయే కొన్నేళ్లలో  డజనుకిపైగా  ఎయిర్​పోర్టులను ప్రైవేటుకి అప్పచెప్పాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ బిడ్డింగ్​ ప్రాసెస్​లో తమ గ్రూప్​ పాల్గొంటుందని బన్సాల్​ చెప్పారు. నవీ ముంబై ఎయిర్​పోర్టును  2,866 ఎకరాలలో ఇప్పటికే అదానీ గ్రూప్​ డెవలప్​ చేస్తోంది.

2030 నాటికి ఈ ఎయిర్​పోర్టు 9 కోట్ల మంది ప్యాసింజెర్స్​ను హ్యాండిల్​ చేయగలిగేలా అప్​గ్రేడ్​ చేస్తున్నారు. రాజధాని ఢిల్లీలో కూడా మరో కొత్త ఎయిర్​పోర్టును జురిచ్​ ఎయిర్​పోర్ట్​ ఇంటర్నేషనల్​ డెవలప్​ చేస్తోంది. ఈ ఎయిర్​పోర్టుకు ఏటా 7 కోట్ల మంది ప్యాసింజెర్లను హ్యాండిల్​ చేయగలుగుతుంది. కర్నాటక, గుజరాత్​, ఆంధ్ర ప్రదేశ్​ రాష్ట్రాలలో మరికొన్ని గ్రీన్​ఫీల్డ్​ ఎయిర్​పోర్టులు ఏర్పాటు కానున్నాయి. అదానీ గ్రూప్​ చేతిలోని 7 ఎయిర్​పోర్టులూ డొమెస్టిక్​ ట్రావెలర్స్​ సెగ్మెంట్లో 92 శాతం గ్రోత్​, ఇంటర్నేషనల్​ట్రావెలర్స్ సెగ్మెంట్లో 133 శాతం గ్రోత్​ను సాధించాయి. ఈ ఎయిర్​పోర్టులకు వచ్చే డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ ఫ్లయిట్స్​ సంఖ్య కూడా  వరసగా 58 శాతం, 61 శాతం చొప్పున పెరిగాయి. 

ఏవియేషన్​పై బుల్లిష్​గా ఉన్నాం....

దేశంలోని ఏవియేషన్​ మార్కెట్​పై తాము బుల్లిష్​గా ఉన్నామని బన్సాల్​ పేర్కొన్నారు. డిసెంబర్​ 2024 నాటికి నవీ ముంబై ఎయిర్​పోర్టు ఫస్ట్​ఫేజ్​ పూర్తవుతుందని చెప్పారు. ఈ ఫేజ్​లో 2 కోట్ల మంది ప్యాసింజర్లను హ్యాండిల్​ చేసే కెపాసిటీ వస్తుందని వివరించారు. ముంబై ఎయిర్​పోర్టును కూడా అదానీ గ్రూపే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే రెండేళ్లలో 12 బిలియన్​ డాలర్లను దేశంలోని ఎయిర్​పోర్టులపై ఖర్చు పెట్టాలని ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. ఎయిర్​లైన్స్​ కంపెనీలు ఇప్పటికే వందలాది విమానాల కోసం ఆర్డర్లు కూడా ఇచ్చాయి. ఎయిర్​ట్రావెల్ భారీగా ​ పెరుగుతుండటంతో ఇప్పుడున్న ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై ఒత్తిడి ఎక్కువవుతోంది.