
యాదాద్రి, వెలుగు : వానాకాలం సీజన్వడ్ల కొనుగోలు ప్రక్రియ కోసం అవసరమైన వాటిని గుర్తించాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కొనుగోలు సెంటర్లకు ప్యాడీ క్లీనర్లు ఎన్ని అవసరం పడతాయో ఇండెంట్ రెడీ చేయాలన్నారు. వీటి కొనుగోలు, పర్యవేక్షణకు అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో, డీసీవో, డీఏవో, సివిల్ సప్లయ్ డీఎం, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
చిట్యాల గోడౌన్ తీసుకోండి..
2023–-24 యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ను వెంటనే అందించాలని అడిషనల్ కలెక్టర్వీరారెడ్డి ఆదేశించారు. మిల్లర్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బియ్యం నిల్వ కోసం స్థలం కొరత ఉన్నందున చిట్యాలలోని గోడౌన్‌ను తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్‌పోర్ట్‌లో జాప్యం జరగకుండా రైల్వే వ్యాగన్ల సంఖ్య పెంచాలన్నారు. వేర్వేరుగా నిర్వహించిన మీటింగ్స్‌లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.