లంచం ఇస్తేనే ఇంక్రిమెంట్లు... ఆదిలాబాద్ రిమ్స్లో స్టాఫ్ నర్సుల నుంచి వసూళ్లు

లంచం ఇస్తేనే ఇంక్రిమెంట్లు... ఆదిలాబాద్ రిమ్స్లో స్టాఫ్ నర్సుల నుంచి వసూళ్లు

ఆదిలాబాద్ రిమ్స్ అసుపత్రిలో వసూళ్ల దందా కలక‌లం‌ రేపుతోంది. స్టాఫ్  నర్సుల ఇంక్రిమెంట్ కోసం‌ రిమ్స్ లోని  ఓ‌ ఉద్యోగి‌‌ డబ్బులు వసూళ్లు చేస్తుంది. ఒక్కోక్క ఉద్యోగి నుండి నాలుగు వేల రుపాయల చోప్పు‌న మొత్తం లక్ష 40 వేలు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు హైదారాబాద్ లోని ‌‌డైరెక్టర్ అఫ్ హెల్త్ లోని అధికారులకు మామూళ్లు ఇవ్వాలని వసూళ్లు చేసినట్లు సమాచారం. 2011 సంవత్సరంలో రిక్రూటైన ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెండింగ్ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్లు ..ఉద్యోగుల ఖాతాల్లో పడాలంటే  ఉద్యోగి ..స్టాఫ్ నర్సుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ : పురుగుల మందు తాగిన ఇద్దరు విద్యార్థులు మృతి

 అయితే ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఇంక్రిమెంట్స్ వసూళ్ల ఘటనపై పై అధికారులు స్పందించారు. దీనిపై నిజా నిజాలు తేల్చేందుకు ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ ను ఆదేశించారు. నివేదిక అనంతరం వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు చేపడుతామని రిమ్స్  డైరెక్టర్ తెలిపారు.