
ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్స్ లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒకవైపు అగ్నిమాపక శాఖ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూనే.. గ్రూప్ వన్ జాబ్ కొట్టడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శశిధర్ రెడ్డి గ్రూప్ 1 జాబ్ సాధించడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 1 లాంటి జాబ్ కొట్టడం గొప్పవిషయంగా అందరూ మెచ్చుకుంటున్నారు. ఒక జాబ్ కొట్టుడే ఎక్కువ.. అలాంటిది ఉద్యోగం చేస్తూ గ్రూప్ సాధించడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. ఎవరైనా జాబ్ వచ్చిందంటే ఆ సాలరీతో అవసరాలు తీర్చుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. మళ్లీ ప్రిపరేషన్ అంటే దూరంగా ఉంటారు. కానీ.. అనుకున్న లక్ష్యాన్ని ఒకవైపు ఉద్యోగం చేస్తూనే చేరుకున్నాడు శశిధర్ రెడ్డి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ శశిధర్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో.. అసిస్టెంటు ట్రేజరీ ఉద్యోగాన్ని సాధించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. శశిధర్ రెడ్డిని అతని స్నేహితులు, బంధువులు అభినందిస్తున్నారు.