V6 News

నల్గొండలో ఏబీహెచ్ఎఫ్ బ్రాంచ్ ప్రారంభం

నల్గొండలో ఏబీహెచ్ఎఫ్ బ్రాంచ్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ (ఏబీహెచ్​ఎఫ్) లిమిటెడ్ తెలంగాణలోని నల్గొండలో కొత్త శాఖను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో కంపెనీ బ్రాంచ్​ల సంఖ్య తొమ్మిదికి చేరింది.  స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిన్న వ్యాపారస్తులకు హోంలోన్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా ఎటువంటి లాగిన్ ఫీజు లేకుండా రూ.50 లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తారు. తక్కువ డాక్యుమెంటేషన్‌‌‌‌‌‌‌‌తో సులభంగా రుణాలు అందించడం ద్వారా స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతామని ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది.