క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌తో వస్తున్న అడివి శేష్

క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌తో వస్తున్న అడివి శేష్

క్షణం, ఎవరు లాంటి థ్రిల్లర్స్‌‌‌‌తో మెప్పించిన అడివి శేష్, త్వరలో మరో క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అదే ‘హిట్ 2’. ఆమధ్య విశ్వక్‌‌‌‌సేన్‌‌‌‌ హీరోగా నాని నిర్మించిన ‘హిట్’ సక్సెస్ కావడంతో ఇప్పుడు హిందీలోనూ రీమేక్ అవుతోంది. దీంతో ఆ పేరుతో ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసి వరుస సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు నాని. ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనునే దీనికీ దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న శేష్‌‌‌‌ బర్త్ డే సందర్భంగా  ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌ని రిలీజ్ చేశారు. సినిమాల్లో పోలీసాఫీసర్‌‌‌‌‌‌‌‌ అనగానే రఫ్ లుక్‌‌‌‌లో రగ్డ్‌‌‌‌గా కనిపిస్తూ సీరియస్‌‌‌‌గా పంచ్ డైలాగ్స్ చెప్పడం చూస్తుంటాం. అందుకు పూర్తి డిఫరెంట్‌‌‌‌గా, కూల్‌‌‌‌ కాప్‌‌‌‌గా ఇందులో కనిపిస్తున్నాడు శేష్. తన క్యారెక్టర్ పేరు ‘కేడీ’ అని రివీల్ చేశారు. ‘అతనో కూల్ కాప్.. అతను ఎప్పటికీ ఆగడు’ అంటూ ఈ లుక్‌‌‌‌ని విడుదల చేశారు. ఈ కూల్‌‌‌‌ కాప్ ఎలాంటి కేస్ ఇన్వెస్ట్ చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తనతో పాటు డాగ్‌‌‌‌కి కూడా ఇందులో ఇంపార్టెన్స్ ఉన్నట్టు పోస్టర్స్, వీడియోని బట్టి తెలుస్తోంది. ‘మేజర్’ టీమ్ కూడా శేష్‌‌‌‌కి బర్త్ డే విషెస్‌‌‌‌ చెప్పింది.  ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది.