సైబర్ నేరగాళ్ల టార్గెట్ వాళ్లే...జాగ్రత్త

సైబర్ నేరగాళ్ల టార్గెట్ వాళ్లే...జాగ్రత్త

పెద్దవాళ్లు, చదువులేని వాళ్లు స్కామర్‌‌ల టార్గెట్​. డెలివరీ బాయ్‌‌లకు, ఏజెంట్‌‌లకు ఓటీపీ చెప్పేటప్పుడు జాగ్రత్త! నమ్మకం లేని, అస్సలు తెలియని వెబ్‌‌సైట్‌‌ లింక్‌‌లు ఓపెన్‌‌ చేయొద్దు. ఈ మధ్య రైతు బంధు డబ్బులు అకౌంట్​లో పడతాయని, అందుకోసం ఫోన్​ నెంబర్​ని అకౌంట్​కి లింక్ చేయడానికి ఓటీపీ చెప్పాలని ఫోన్​కాల్స్ చేస్తున్నారు. 

ఓటీపీ చెప్పమని ఫోన్​ కాల్​ వస్తే... వాళ్లు ఎక్కడి నుంచి ఫోన్​ చేస్తున్నారో గమనించాలి. బ్యాంక్​, ఫైనాన్స్​ సంస్థలు ఓటీపీ, ఇతర వివరాల వంటివి అడగరు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సమాచారం కోసం అడిగే వెబ్​ లింక్‌‌లు లేదా వెబ్‌‌సైట్‌‌లను నమ్మొద్దు.

సైబర్ క్రైమ్​ డివిజన్ 

వన్-టైమ్ పాస్‌‌వర్డ్ (ఓటీపీ), వన్-టైమ్ పిన్ అని కూడా పిలుస్తారు, ఇది కంప్యూటర్ సిస్టమ్ లేదా ఇతర డిజిటల్ డివైజ్​లో ఒక లాగిన్ సెషన్ లేదా ట్రాన్సాక్షన్​కి మాత్రమే వాడే పాస్‌‌వర్డ్. బ్యాంక్​ ఖాతాదారులను మోసగించిన నేరస్తులు ఓటీపీ లేదా స్మార్ట్‌‌ఫోన్‌‌ను హ్యాక్ చేయడం ద్వారా దాన్ని యాక్సెస్ చేయడం వంటి కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నేరస్తులు బ్యాంక్ కస్టమర్‌‌ని మోసం చేసే మరో మార్గం ఏమిటంటే... నకిలీ ఐడీ ప్రూఫ్​తో మొబైల్ ఆపరేటర్‌‌ని సంప్రదించి నకిలీ సిమ్ కార్డ్‌‌ని తీసుకోవడం. ఆపరేటర్ ఒరిజినల్ సిమ్‌‌ను బ్లాక్ చేస్తాడు. దాంతో డూప్లికేట్​ సిమ్​కి ఓటీపీ వస్తుంది. దాంతో ఆన్‌‌లైన్ లావాదేవీలు చేస్తారు సైబర్​ కేటుగాళ్లు.