ఎన్నికల్లో నన్నుపోటీ చేయొద్దన్నారు: మురళీ మనోహర్ జోషి

ఎన్నికల్లో నన్నుపోటీ చేయొద్దన్నారు: మురళీ మనోహర్ జోషి

బీజేపీ పెద్దలు ఒక్కక్కరుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? లేక తప్పిస్తున్నారా?  పార్టీ సీనియర్ నేత, వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారా? లేక సీటు ఇవ్వకుండా అవమానపరిచారా? అంటే.. సీనియర్ నేతలకు బీజేపీ మెల్ల మెల్లగా ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తోంది.

2019 లోక్ సభ ఎన్నికల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు పోటీచేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే  తనను ఎన్నికల్లో పోటీచేయొద్దన్నారంటూ మురళీ మనోహర్ జోషీ  వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్ ఓటర్లను ఉద్దేశిస్తూ రాసిన లేఖలో ఆయన  ఈ విషయాన్నిప్రస్తావించారు.‘ ప్రియమైన కాన్పూరు ఓటర్లకు..  లోక్ సభ ఎన్నికల్లో అసలు కాన్పూరు నుంచే కాకుండా ఎక్కడి నుంచి పోటీ చేయవద్దు. ఎన్నికలకు దూరంగా ఉండాలనేది పార్టీ నిర్ణయమని బీజీప ప్రధాన కార్యదర్శి రామ్ లాల్  చెప్పారు‘ అని అన్నారు. మురళీ మనోహర్ జోషీ కేంద్రమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షడిగా పనిచేశారు. 2014 లో  వారణాసి నుంచి తప్పుకుని కాన్పూర్ నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో గెలిచారు.