Fact Check : నిన్న రష్మిక.. ఇవాళ సారా టెండూల్కర్.. AIతో డ్యామేజ్

Fact Check : నిన్న రష్మిక.. ఇవాళ సారా టెండూల్కర్.. AIతో డ్యామేజ్

నిన్న రష్మిక మందన్నా.. ఇవాళ సారా టెండూల్కర్, శుభ్ మాన్ గిల్.. సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. దుర్వినియోగం అవుతున్న అడ్వాన్డ్స్ టెక్నాలజీపై నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రష్మిక మందన్నా వీడియోను ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసిన దుండగులు.. తాజాగా స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, క్రికెటర్ శుభ్ మన్ గిల్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టారు. వాస్తవానికి సారా సోదరుడు అర్జున్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా ఆమె దిగిన ఫొటో అది.. దీనిని దుండగులు మార్ఫింగ్ చేసి శుభ్ మన్ గిల్ ఫొటోను యాడ్ చేశారు. ఇది సారా, శుభ్ మన్ గిల్ ను కౌగలించుకున్నట్లు చూపుతోంది. సారా, శుభ్ మన్ గిల్  డేటింగ్ పుకార్లను ధృవీకరించలేదు.. 

ఇటీవల రష్మిక మందన్నా AI  డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. దీంతో రష్మిక చాలా హర్ట్ అయ్యింది. ఆమెను సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు కూడా మద్దతుగా నిలిచారు. ఈ ఘటన పై కేంద్ర ఐటీ శాఖ కూడా విచారణ ప్రారంభించింది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న డిజిటల్ నాగరిక్ లందరి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఏ యూజర్ ఎలాంటి తప్పుడు సమాచారం పోస్ట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా ఫ్లాట్ ఫారమ్ లకు ఉందని కేంద్ర ఐటీ శాఖ చెప్పింది. ఎవరైనా వినియోగదారుడు తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే..36 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. దీనికి కట్టుబడి ఉండకపోతే రూల్ 7, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిస్తూ కేంద్ర ఐటీ శాఖ ట్వీట్ చేసింది.