Unstoppable with NBK: యానిమల్‌తో లయన్ మీటింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది..ఎప్పుడంటే?

Unstoppable with NBK: యానిమల్‌తో లయన్ మీటింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది..ఎప్పుడంటే?

అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ(Balakrishna). గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య..అస్సల్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు.

ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు.

also read :- లోకేష్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఖైదీ2, విక్రమ్2 సినిమాలకు డైరెక్టర్ చేంజ్

ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. అన్‍స్టాపబుల్ నెక్స్ట్ఎపిసోడ్ గురించి ఆహా ఓటీటీ (Aha OTT) ప్లాట్‍ఫామ్ రీసెంట్ గా ఓ హింట్ ఇస్తూ..వైల్డ్ గెస్ట్స్ వస్తున్నారంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా..మేకర్స్ ఇచ్చిన హింట్స్ లోనే రాబోయే గెస్ట్స్ ఎవరనేది ఇట్టే అర్ధమైపోయింది. కానీ, ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందందనే డేట్ మాత్రం ప్రకటించలేదు.

లేటెస్ట్గా రణబీర్, రష్మిక, సందీప్ వంగా.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. అయితే..ఇప్పటికే ఈ వైల్డ్..ఎంటర్ టైన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిపారు. 

యానిమల్‌ (Animal)తో లయన్ మీటింగ్‌కి నవంబర్ 24న టైం ఫిక్స్ అయిపొయింది..ఈ వైల్డ్ ఎపిసోడ్ ఈ నెల (నవంబర్ 24న) రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. కానీ, షో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందనే తెలియజేయలేదు. కాగా ఈ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ ఫోన్ కాల్ ద్వారా..యానిమల్ టీం పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తుంది.

దీంతో రష్మిక, విజయ్ గురించి బాలయ్య ఏం ప్రశ్నించారో..అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో నిండిపోయింది. రీసెంట్ గా గీత‌-గోవిందం దీపావ‌ళి పార్టీ.. అంటూ నెటిజన్ల సాక్ష్యాలతో వీరిద్దరి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.