ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337గా నమోదు

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337గా నమోదు

ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఢిల్లీలో యావరేజ్‌ ఎయిర్‌ క్వాలిటీ.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌  337గా నమోదైంది. ఎయిర్‌ పొల్యూషన్‌ పెరిగిపోవడంతో  దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత 407గా  నమోదైంది. దీంతో  ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలను చేపట్టకూడదని ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత 400లకు పడిపోయింది. 

ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ 337కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణిస్తారు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని అర్థం చేసుకోవచ్చు. 100 నుంచి -200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉంటుంది.  200 నుంచి- 300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300 నుంచి -400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని అర్థం.  ఇక  400 నుంచి -500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.