కప్పేసిన పొగమంచు..డేంజర్ లెవల్ లో ఢిల్లీ

కప్పేసిన పొగమంచు..డేంజర్ లెవల్ లో ఢిల్లీ

దేశ రాజధాని   ఢిల్లీలో  గాలి  కాలుష్యం  ప్రమాదకర  స్థాయిలోనే ఉంది. ఇవాళ  ఉదయం  ఢిల్లీలోని   కొన్ని ప్రాంతాల్లో  గాలి కాలుష్య తీవ్రత   డేంజర్ లెవల్ లో నమోదైంది.  లోధా రోడ్డులో   AQI 5 వందల  పాయింట్లుగా  ఉంది. ఢిల్లీ   సెంట్రల్ లో  434 పాయింట్లుగా నమోదైంది. ఉదయం  పొగ మంచు  దేశ రాజధానిని  కప్పేసింది. యూపీలోని పలు ప్రాంతాల్లోనూ దట్టమైన పొగ మంచు అలుముకుంది. పొగ మంచు, కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాస్క్ లు ధరించి ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారు. రేపటి వరకు  స్కూళ్లకు  సెలవు ప్రకటించారు ఢిల్లీ అధికారులు.

కాలుష్య  తీవ్రత్రను  తగ్గించేందుకు  ఢిల్లీ అధికారులు  శ్రమిస్తున్నారు. ఇందుకోసం  300 ప్రత్యేక  బృందాలు  పని చేస్తున్నాయి. కాలుష్యం అధికంగా   ఉండే  7 ఇండస్ట్రీయల్  కారిడార్లు   సహా  ట్రాఫిక్ అధికంగా ఉండే  ప్రాంతాలపై  అధికారులు  ప్రధానంగా  దృష్టి సారించారు.  ప్రధానమంత్రి ప్రిన్సిపల్  సెక్రటరీ   స్వయంగా రంగంలోకి  దిగారు. ఢిల్లీ,  హర్యాణా, పంజాబ్  సీఎస్ లతో  ఆయన.. జిల్లాల  వారీగా పరిస్థితిని  ఎప్పటికప్పుడూ  సమీక్షలు  నిర్వహిస్తున్నారు. కాలుష్య  నియంత్రణకు  అధికారులు  సూచనలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే  అవసరమైన  సామాగ్రి అందించింది  కేంద్ర ప్రభుత్వం.