ఐశ్వర్య అర్జున్కు టాలీవుడ్ ప్రముఖుల ఆశీస్సులు

ఐశ్వర్య అర్జున్కు టాలీవుడ్ ప్రముఖుల ఆశీస్సులు

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ప్రముఖుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. సోమవారం సూపర్ స్టార్ కృష్ణను ప్రత్యేకంగా కలిసిన అర్జున్ తన కూతురుకి ఆశీర్వచనం ఇప్పించారు.. అనంతరం కళాతపస్వీ కె. విశ్వనాథ్ ను కలిసిన ఆశీస్సులు తీసుకుంది ఐశ్వర్య అర్జున్. అర్జున్ తన కూతురును టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీకి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఇటీవల హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు లెజెండరీల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తనకు హీరోగా గుర్తింపు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమలో కుతురుని హీరోయిన్ గా నిలబెట్టాలని అర్జున్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.