భారీ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్గా ‌‌‌‌‌‌‌‘వలిమై’

భారీ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్గా ‌‌‌‌‌‌‌‘వలిమై’

అజిత్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘వలిమై’. హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మాత. నిన్న ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. అడ్వెంచరస్‌‌ బైక్ రేసింగ్ సీన్స్‌‌తో ఈ ట్రైలర్‌‌‌‌ కట్ చేశారు. రియల్‌‌ లైఫ్‌‌లోనూ బైక్‌‌ రేసింగ్స్‌‌ను ఎంతో ఇష్టపడే అజిత్ యాక్షన్‌‌ సీన్స్‌‌తో సర్‌‌‌‌ప్రైజ్ చేశాడు. ఇదో ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. ఒకే రకమైన క్యాస్ట్యూమ్స్ వేసుకుని, బైక్స్​పై తిరుగుతూ ఓ గ్యాంగ్ నేరాలు చేస్తుంటుంది. వాళ్లెవరు, వారిని నడిపించేదెవరు అనేది ఎవరికీ తెలియదు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్‌‌‌‌గా అజిత్ కనిపిస్తున్నాడు. స్టైలిష్‌‌ మేకింగ్‌‌ ఇంప్రెస్ చేస్తోంది. జనవరి 14న సినిమా విడుదల కానుంది.