బీజేపీ పతనం కొనసాగుతుంది

బీజేపీ పతనం కొనసాగుతుంది

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి సత్తా చాటారు. గురువారం వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన నాయకత్వంలోని బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. సమాజ్ వాదీ పార్టీ ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికీ బీజేపీ హవా ముందు నిలవలేకపోయింది. యూపీలోని మొత్తం 403 స్థానాల్లో బీజేపీ 255 సీట్లలో జయభేరి మోగించగా.. ఎస్పీ కేవలం 111 సీట్లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఓటమిపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. తాము బీజేపీని ఓడించనప్పటికీ.. అసెంబ్లీలో ఆ పార్టీ సీట్లను తగ్గించామన్నారు. ‘బీజేపీ సీట్లు తగ్గించొచ్చని మేం నిరూపించాం. బీజేపీ పతనం కొనసాగుతుంది’ అని అఖిలేశ్ ట్వీట్ చేశారు. తమ పార్టీ ఓట్ షేర్ 1.5 రెట్లు, సీట్లు 2.5 రెట్లు పెరిగాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో నెలకొన్న భ్రమలు, భ్రాంతిని సగానికి తగ్గించామని.. మిగిలిన సగాన్ని త్వరలో తొలగిస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్ ఫ్రంటు డౌటే

బీఎస్పీ అంచనాలకు విరుద్ధంగా యూపీ ఫలితాలు